నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

కృష్ణా: గన్నవరం మండలంలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చిన్న అవుటపల్లి, దుర్గాపురం, విమానాశ్రయం సిటీ, మరలపాలెం, గన్నవరం పట్టణం ప్రాంతాలలో సరఫరా నిలిపివేస్తామన్నారు. ఈ ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరారు.