రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని వినతి

HYD: ఆమనగల్లో మార్వాడీ సమాజంపై విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే చర్యలకు దిగిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా విజ్ఞప్తి చేశారు. ఇటీవల తమ సమాజంలోని సభ్యులను లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత నినాదాలు, బెదిరింపులకు పాల్పడిన కొన్ని తీవ్రమైన సంఘటనలు జరిగాయన్నారు.