రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ పోటీలకు ఎంపికైన కేజీబీవీ విద్యార్థినులు

రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ పోటీలకు ఎంపికైన కేజీబీవీ విద్యార్థినులు

ప్రకాశం: చంద్రశేఖరపురంలోని కేజీబీవీ విద్యార్థినులు రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ పోటీలకు ఎంపికయ్యారు. 2025-26 కు గాను జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు మైనంపాడులో ఈనెల 11, 12 తేదీలలో జరిగాయి. పూజ, గురునవ్య, నవ్య శ్రీ, సరస్వతిలు గ్రూప్ డాన్స్ పోటీలో పాల్గొన్నారు. అక్టోబర్ 23న అమరావతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో వీరు పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.