VIDEO: ఎద్దుల బండిని ఢీకొట్టిన కారు

VIDEO: ఎద్దుల బండిని ఢీకొట్టిన కారు

KRNL: ఆదోని-ఢనాపురం మార్గంలోని భీమా కాలేజీ సమీపంలో ఆదివారం రాత్రి ఎద్దుల బండిని వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పత్తి సంచులతో ఇంటికి వస్తున్న కల్లుబావికి చెందిన రైతు మంగళ కర్రెప్ప గాయపడ్డారు. ఎద్దులకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేశారు.