కావలిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం

NLR: కావలి పట్టణంలో మంగళవారం సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని కచేరి మిట్టలో సచివాలయ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, టీడీపీ నేత ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.