మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే సమావేశం

అనంతపురం: రాప్తాడు మార్కెట్ యార్డ్ నూతన కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే పరిటాల సునీత అనంతపురం క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కమిటీ సభ్యులను అభినందించి సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం సభ్యులంతా కలసి పనిచేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు.