మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ
VZM: వేపాడ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు పాల్గొన్నారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఇందులో ఎంపీడీవో సి హెచ్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.