వర్షాల కారణంగా కేయూలో జరగాల్సిన పరీక్షలు వాయిదా
హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 28, 29వ తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ గురువారం ప్రకటించారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. మిగతా పరీక్షలన్నీ యథాతధంగా జరుగుతాయని, వాయిదా వేసిన పరీక్షల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామన్నారు.