మునగపాకలో ఈనెల 14న ఆలయ వార్షికోత్సవం

మునగపాకలో ఈనెల 14న ఆలయ వార్షికోత్సవం

AKP: మునగపాకలో ఈనెల 14న సాంబశివుని ఆలయ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. దీనిలో భాగంగా గురువారం కళ్యాణ రాట మహోత్సవం జరుగుతుందన్నారు. ఆరోజు ఉదయం నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాంబమూర్తి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు. రాత్రి కోలాటం ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు.