'రేషన్ కార్డులతో పథకాల లబ్ధి'

VKB: రేషన్ కార్డుతోనే పలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందేందుకు వీలుందని డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్ కృష్ణ ప్రసాద్ అన్నారు. ఆదివారం పరిగి మండలం జాఫర్ పల్లిలో 14 నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం పంపిణీ చేసిందన్నారు.