వృద్ధుడిపై ఎద్దు దాడి.. పరిస్థితి విషమం

KRNL: ఆలూరు మెయిన్ బజారులో గురువారం ఉదయం పద్మనాభ దాస్ అనే వృద్ధుడిపై ఎద్దు దాడి చేసింది. తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. పట్టణంలో ఎద్దులు, ఆవులు సంచారం అధికమైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.