డుంబ్రిగుడ చేరిన సైకిల్ యాత్ర

డుంబ్రిగుడ చేరిన సైకిల్ యాత్ర

ASR: ఆల్ ఇండియా సైకిల్ యాత్ర చేస్తున్న ముగ్గురు యువకులు శుక్రవారం డుంబ్రిగుడలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. కడపకు చెందిన మనోజ్, మహబూబ్‌నగర్‌కు చెందిన విక్రమ్, బిహార్‌కు చెందిన బిక్కూ పటేల్ 16 రోజుల క్రితం హైదరాబాద్‌లో యాత్ర ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పర్యటించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ యాత్రను పూర్తి చేయడానికి ఇంకా 45 రోజులు పడుతుందని తెలిపారు.