గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి
SKLM: పలాస మండలం శాసనాం గ్రామ సమీప జాతీయ రహదారి దాటుతున్న జింకను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందిన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన జింకను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.