బీజేపీ జిల్లా కోశాధికారిగా సోమ నరసయ్య

BHNG: జిల్లా బీజేపీ కోశాధికారిగా రెండవసారి గుజ్జ సోమ నరసయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం మోత్కూరు పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నరసయ్యకు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు చాడ మంజుల, శ్రీనివాస్, సోమయ్య, మనోహర్, దశరథ, సత్యనారాయణ, ప్రకాష్, విజయలక్ష్మి, శ్రీధర్ గౌడ్, అనిల్, మధు తదితరులు పాల్గొన్నారు.