మృతుడికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని వీరన్నపేట ప్రాంతానికి చెందిన పెద్ద గొల్ల రాములు ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ వారి నివాసానికి చేరుకుని మృతుని పార్దివదేహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.