ఏసీబీకి చిక్కిన ఎస్సై
NGKL: రూ.20 వేలు లంచం తీసుకుంటూ హిమాజిపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి ఇవాళ ఏసీబీకి చిక్కారు. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్, జేసీబీని వదిలేందుకు బాధితుడి నుంచి రూ.30 వేలు డిమాండ్ చేయగా, ఇప్పటికే రూ.20 వేలు తీసుకున్నట్లు ఆధారాలతో ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ సోమవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్ ఫైన్ చెల్లించినా అదనపు డబ్బులు అడగడంతో బాధితుడు అధికారులను ఆశ్రయించాడు.