VIDEO: పరీక్షకు వెళ్తూ ప్రమాదం.. ఇంటర్ విద్యార్థికి గాయాలు
JN: కొడకండ్ల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్ సెకండియర్ చదువుతున్న రామన్నగూడెం గ్రామానికి చెందిన సాయి తేజ పరీక్ష రాయడానికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. శనివారం అతను ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో కిందపడిపోయి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అతన్ని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.