ఆదోనికి కొత్త తహశీల్దార్..!
KRML: ఆదోని తహశీల్దార్ శేషఫణి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న రమేశ్ను కర్నూలు కలెక్టర్ కార్యాలయానికి అటాచ్ చేశారు. శేషఫణి ఎమ్మిగనూరులో పనిచేస్తూ ఇటీవల పలు ఆరోపణలపై కలెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేశారు. బదిలీలో భాగంగా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదోనికి కేటాయించారు. ప్రజలు సమస్యలపై బ్రోకర్లను సంప్రదించకుండ నేరుగా తహశీల్దార్ను కలవాలని సూచించారు.