మహబూబ్ నగర్‌లో ఏడు పంచాయతీలు ఏకగ్రీవం
మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అడ్డాకులలో ముత్యాలంపల్లి, భూత్పూర్‌లో ఏవిఆర్ కాలనీ, బట్టుపల్లి చౌలా తండా, పెద్ద తండా, జడ్చర్లలో దేవునిగుట్ట తండా, మూసాపేటలో అచ్చయ్యపల్లి పంచాయతీలు ఏకగ్రీవంగా ప్రకటించగా, దీనిపై అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.