లేబర్ కోడ్స్ అమలుకు వ్యతిరేకంగా నిరసన
SKLM: లేబర్ కోడ్స్ అమలుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త 'బ్లాక్ డే'లో భాగంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. కార్పొరేట్ ప్రయోజనాల కోసం తెచ్చిన ఈ కోడ్స్ కార్మికులకు ఉరితాళ్లు వంటివని, వీటిని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలతో కార్మికులు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించారు.