ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి: బార్ అసోసియేషన్

ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి: బార్ అసోసియేషన్

MBNR: ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు కదం తొక్కారు. కోర్టు ప్రాంగణం నుంచి భారీ ర్యాలీ, హోరెత్తే నినాదాలతో తెలంగాణ చౌరస్తాలో న్యాయ వాదులు నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనంతరెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రదాడిని ప్రతి ఒక్క భారతీయుడు ముక్తకంఠంతో ఖండించాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు.