యూరియా లారీలు వస్తున్నాయనేది అవాస్తవం: వ్యవసాయ అధికారి

WGL: నల్లబెల్లి మండలానికి 8 లారీల యూరియా వస్తుందనే వార్తలు అవాస్తవమని నల్లబెల్లి వ్యవసాయ అధికారి రజిత తెలిపారు. ఏదైనా సమాచారం ఉంటే తామే అందిస్తామని, దయచేసి అలాంటి వార్తలను నమ్మవద్దని ఆమె సూచించారు. ఈ రోజు ఎక్కడా యూరియా అందుబాటులో లేదని ఆమె స్పష్టం చేశారు.