బంజారా ప్రీమియర్ లీగ్ పోస్టర్ ఆవిష్కరణ
MBNR: జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 9వ తేదీన నిర్వహించనున్న బంజారా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి, ఎన్. పి. వెంకటేష్, వినోద్ కుమార్ ఈ పోస్టర్లను విడుదల చేశారు.