అమరావతిలో NTR స్మృతివనం: CM చంద్రబాబు

AP: తెలుగువారి ఆత్మగౌరవం ఉట్టిపడేలా అమరావతిలో NTR స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని CM చంద్రబాబు అధికారులకు దిశానిర్ధేశం చేశారు. 182 మీటర్ల ఎత్తయిన విగ్రహ స్మృతివనం ప్రాజెక్టుకు అనుబంధంగా నీరుకొండ రిజర్వాయర్‌ను తీర్చిదిద్దాలన్నారు. ప్రత్యేకించి పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శించేందుకు అనువుగా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, చంద్రబాబు NTR విగ్రహం నమూనాను పరిశీలించారు.