స్మార్ట్ సిటీ మిషన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు: రాహుల్

స్మార్ట్ సిటీ మిషన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు: రాహుల్

మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన స్మార్ట్ సిటీ మిషన్ వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ పథకం గురించి ప్రధాని మోదీ ఎప్పుడూ గొప్పలు చెబుతుంటారని.. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసిన ఏ ఒక్క నగరాన్ని కూడా కేంద్రం పూర్తిగా అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు.