బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ

TG: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో 200 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ప్యూరోపాల్ క్రియేషన్ & ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులకు గాలం వేసి మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరి నుంచి విడతల వారీగా రూ.2 లక్షల వరకు వసూలు చేసింది. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.