పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
KMM: పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది తమ ఓటు హక్కు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఎన్నికల కమీషన్ సూచనల మేరకు ఎన్నికల విధులు నిర్వహించే ఓటర్లకు, అత్యవసర సేవలలో పనిచేసే ఓటర్లకు సౌకర్యం కల్పించామని చెప్పారు. దీనికోసం సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేశామన్నారు.