శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం: ఎస్పీ
VKB: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. మతపరమైన సమస్యలు, అల్లర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై పోలీసు సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక "యాంటీ రైట్" డ్రిల్ పర్యవేక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమాజంలో అలజడి సృష్టించే శక్తుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.