జిల్లాలో బీజేపీ రక్తదాన శిబిరం

జిల్లాలో బీజేపీ రక్తదాన శిబిరం

NLR: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ లెక్చరర్స్ కాలనీలో ఇవాళ రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు పి.సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు.