VIDEO: 49 రోజుకు చేరుకున్న రైతుల ఆందోళన

AKP: మాకవారపాలెం మండలం జీ.కోడూరు గ్రామస్తులు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద చేస్తున్న ఆందోళన మంగళవారం నాటికి 49వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు నష్టం కలుగజేస్తున్న క్వారీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన మొదలుపెట్టినప్పటి నుంచి కనీసం అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.