ముత్యాలమ్మ ఆలయంలో మరమ్మతులకు సూచన

HYD: రేతిఫైల్ బస్ స్టాప్ ఎదురుగా ఉన్న ముత్యాలమ్మ దేవాలయాన్ని మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ దీపిక సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ఆలయ పరిసరాలను పరిశీలించారు. గత 2 సంవత్సరాలుగా ఆలయంలోకి డ్రైనేజీ నీరు రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భక్తులు కార్పొరేటర్ దృష్టికి తెచ్చారు. వెంటనే ఆలయ ఫౌండర్ పద్మారావు కార్పొరేటర్‌తో మాట్లాడారు.