ఉక్కపోతతో ఉడికిపోతున్న నగరవాసులు
HYD: నగరంలోని ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి లాడుతున్నారు. నగరంలో ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. రాత్రి ఉష్ణోగ్రతలూ రెండురోజులుగా అసాధారణంగా పెరిగాయి. కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. జూబ్లీహిల్స్ 40.2 డిగ్రీలు, చందానగర్ 38.6, కాప్రా 38.5, ఎల్బీనగర్ 38.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు పగటిపూట బయటకు వెళ్లాలంటే వానికిపోతున్నారు.