'అగ్రిమెంట్ లేకుండా సాగు చేయొద్దు'
KMM: ఆడ, మగ రకం సీడ్ మక్క విత్తనాలు సాగు చేసే రైతులు సదరు కంపెనీ నుంచి అగ్రిమెంట్ తీసుకోకుండా సాగు చేయొద్దని ఏవో భూక్యా తారాదేవి అన్నారు. కామేపల్లి మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కొన్ని కంపెనీలు తమ కంపెనీ విత్తనాలతో అధిక దిగుబడి సాధించడంతో పాటు ఆదాయం వస్తుందని కొందరు ఏజెంట్లు మక్క సాగు చేసే రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు.