మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు: ఎస్సై

మైనర్లకు వాహనాలు  ఇస్తే కఠిన చర్యలు: ఎస్సై

WNP: మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఆదివారం ఎస్సై రజిత హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని అన్నారు. సరైన పత్రాలు లేకుండా, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపినా, సెల్ ఫోన్ మాట్లాడుతూ.. ట్రిపుల్ రైడింగ్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.