విశాఖ తీరంలో NOTAM హెచ్చరిక జారీ

విశాఖ తీరంలో NOTAM హెచ్చరిక జారీ

భారత నౌకాదళం మరో భారీ క్షిపణి పరీక్షకు సిద్ధమైంది. విశాఖపట్నం తీరంలో ఈనెల 13 నుంచి 16 మధ్య సుమారు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగిన నావికాదళ క్షిపణిని పరీక్షించనున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత ప్రభుత్వం ఇప్పటికే ఆ ప్రాంతంలో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ NOTAM హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో సుదీర్ఘ పరిధిలో ఈ ప్రయోగం జరగనుంది.