రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
BDK: దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం దగ్గరలోని ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఇవాళ తెలిపారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు పక్కన మృతి చెంది ఉన్నాడని అన్నారు. అతని వయసు పాతికేళ్లు ఉంటాయని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించినట్లు చెప్పారు.