'మహిళా క్రికెట్ జట్టు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయం'
ATP: ప్రపంచ మహిళ క్రికెట్ చరిత్రలో భారత్ విజయం సాధించడం ఎంతో గర్వించదగ్గ విషయమని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు కొనియాడారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఆదివారం రాత్రి జూనియర్ కళాశాల మైదానంలో లైవ్ స్క్రీన్ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటుచేసి తిలకించారు. మహిళలు, క్రికెట్ అభిమానులు మధ్య ఎమ్మెల్యే కాలువ క్రికెట్ వీక్షించాడు.