పెనమలూరు ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

కృష్ణా: పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ నేటి పర్యటన వివరాలను ఆయన కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8:30 గంటలకు ఉయ్యూరు 16వ వార్డులో డ్రైనేజీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 9 గంటలకు పెనమలూరు పోలీస్ స్టేషన్ వద్ద డ్రైనేజీ శంకుస్థాపన చేయనున్నారు. 9:30 గంటలకు కానూరు గ్రామంలో పలు రోడ్లకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం పలు శుభకార్యాల్లో పాల్గొంటారు.