నిజాయితీకి ఓటు వేయండి: కోట్ల చిత్ర

కర్నూలు: నిజాయితీ గల పార్టీ అయిన టీడీపీకి ఓటు వేయాలని మాజీ కేంద్ర సహాయక మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి కుమార్తె కోట్ల చిత్ర గురువారం నాడు తెలిపారు. బేతంచర్ల పట్టణంలోని ఏడవ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రులుగా పనిచేసిన తన తండ్రి ఆస్తులు కూడ పెట్టలేదన్నారు.