VIDEO: రాజంపేటలో CMRF నిధుల మళ్లింపు కలకలం
అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ నిధుల మళ్లింపు ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. నందలూరు మండలం కుందానెల్లూరు గ్రామానికి చెందిన ఎల్లయ్యకు అందిన రూ.14 లక్షల్లో రూ.8 లక్షలు ఓ టీడీపీ నాయకుడు తన ఖాతాకు మళ్లించుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన టీడీపీ ఇంఛార్జ్ జగన్ అవకతవకలు జరిగి ఉంటే పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని తెలిపారు.