'సంకల్పంపై విద్యార్థులకు అవగాహన'

VZM: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు బాడంగి జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్‌లో విద్యార్థులకు సీఐ కే.నారాయణరావు ఆధ్వర్యంలో బుధవారం సంకల్పంపై అవగాహన కల్పించారు. ఈమేరకు విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. చదువు పట్ల ఏకాగ్రత పాటించాలని కోరారు. మత్తు పదార్థాలపై జరిగే అనార్ధాలను వీడియో రూపంలో చూపించారు.