'అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయం'
మార్కాపురం బాయ్స్ హై స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయురాలు డోలా శ్యామల అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమని ఎమ్మార్వో కే చిరంజీవి అన్నారు. గురువారం పాఠశాలలో ఆమెను ఘనంగా సత్కరించారు. ఇటీవల థాయిలాండ్ దేశంలో జరిగిన వరల్డ్ మాస్టర్ స్పోర్ట్స్ హై జంప్‌లో బంగారు పతకం, ట్రిపుల్ జంప్‌లో బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే.