'కూటమి ప్రభుత్వంలోనే రహదారులకు మోక్షం'

TPT: చిల్లకూరు మండలం తిక్కవరంలో రూ. 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉండేవన్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారులకు మోక్షం కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.