VIDEO: జంగారెడ్డిగూడెంలో నాగుపాము కలకలం

VIDEO: జంగారెడ్డిగూడెంలో నాగుపాము కలకలం

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో జనావాసాల మధ్య సుమారు 8 అడుగుల కోడె నాగుపాము అలజడి సృష్టించింది. స్థానిక చింతల బజారు వద్ద ఉన్న ఒక పాడుబడిన నివాసంలో స్థానికులు పామును గుర్తించారు. సమీపంలో ఉన్న స్నేక్ సేవియర్ సొసైటీకి సమాచారం అందించడంతో అధ్యక్షుడు క్రాంతి చాకచక్యంగా పాముని పట్టుకున్నాడు. అనంతరం దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని తెలిపారు.