ఉచితంగా డీఎస్సీ కోచింగ్

KDP: యూటీఎఫ్ నిర్వహిస్తున్న ఉచిత డీఎస్సీ కోచింగ్ అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరమని కడప డీఈవో షేక్ సంషుద్దీన్ అన్నారు. బుధవారం కడపలోని ఈటీఎఫ్ భవన్‌లో జరుగుతున్న డీఎస్సీ ఉచిత కోచింగ్‌లో ఆయన సైకాలజీ బోధించారు. తక్కువ సమయంలో ఎటువంటి ఖర్చు లేకుండా కడపలోనే నిష్ణాతులైన అధ్యాపకులచే శిక్షణ పొందడం అభినందనీయమని ఆయన తెలిపారు.