గేట్‌లో 1940 ర్యాంక్ సాధించిన విద్యార్థిని

గేట్‌లో 1940 ర్యాంక్ సాధించిన విద్యార్థిని

AKP: ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన చోడిపల్లి పవిత్ర గేట్ ఫలితాల్లో సత్తా చాటి 1940 ర్యాంక్ సాధించింది. మత్స్యకార కుటుంబానికి చెందిన పవిత్ర విశాఖలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ర్యాంకు సాధించిన విద్యార్థినిని శుక్రవారం గ్రామ సర్పంచ్ మైలపల్లి శ్రీనివాసరావు పలువురు గ్రామ పెద్దలు అభినందించి సత్కరించారు.