చౌరస్తాలో పొంచి ఉన్న ప్రమాదం..!

చౌరస్తాలో పొంచి ఉన్న ప్రమాదం..!

VKB: కొడంగల్ పట్టణంలోని అంబేడద్కర్ చౌరస్తాలో మురుగు కాలువ గుంత ప్రమాదకరంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. అసలే చౌరస్తా ఇరుకుగా ఉండటం, మూల మలుపులో గుంత కారణంగా ప్రమాదం పొంచి ఉందన్నారు. డ్రైనేజీ మరమ్మతు పనుల్లో గత కొన్ని రోజుల క్రితం డ్రైనేజీపై ఉన్న బెడ్‌ను తొలగించి అలాగే వదిలేయడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.