SSMB 29 ఈవెంట్.. కార్తికేయ స్పెషల్ వీడియో
మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా 'SSMB 29'. ఈ మూవీ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనెల 15న నిర్వహించనున్నట్లు రాజమౌళి కుమారుడు కార్తికేయ అధికారికంగా వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ వీడియో విడుదల చేశాడు. అలాగే, ఈ ఈవెంట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు సంస్థ స్పష్టం చేసింది.