మహిళా జట్టుకు టాటా బంపర్ ఆఫర్

మహిళా జట్టుకు టాటా బంపర్ ఆఫర్

టాటా మోటార్స్‌ కీలక ప్రకటన చేసింది. వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత మహిళల క్రికెట్‌ జట్టు ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు టాటా సియెర్రా కారును అందించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. త్వరలో లాంఛ్ కానున్న సియెర్రా తొలి బ్యాచ్‌ను ఇస్తామని పేర్కొంది. ఈ సందర్భంగా “లెజెండ్స్‌ మీట్‌ లెజెండ్స్‌” అంటూ ప్రకటన విడుదల చేసింది.