జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా నితీష్ ఎన్నిక

జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా నితీష్ ఎన్నిక

జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) జాతీయ అధ్యక్షుడిగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి నితీష్ తప్ప మరెవరూ బరిలో లేరు. దీంతో ఆయన ఎన్నిక ఖాయమైందని పార్టీ రిటర్నింగ్ అధికారి అనిల్ ప్రసాద్ హెగ్డే అధికారికంగా ప్రకటించారు. మధ్యాహ్నం ఆయనకు ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని అందజేయనున్నారు.